Tollywood Movies | జనవరిలో డాకు మహరాజ్, గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం వంటి పెద్ద చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాగా.. ఇందులో సంక్రాంతికి వస్తున్నాం సూపర్ హిట్ అవ్వగా.. డాకు మహరాజ్ మంచి కలెక్షన్లు రాబట్టింది. ఇంకా ఇవే కాకుండా జనవరిలో అక్షయ్ కుమార్ స్కై ఫోర్స్, షాహిద్ కపూర్ దేవా సినిమాలు వచ్చి ప్రస్తుతం సందడి చేస్తున్నాయి. అయితే అప్పుడు కొత్త ఏడాది రావడం జనవరి నెల కూడా అయిపోవడం ఇట్టే జరిగిపోయాయి. ఇక ఫిబ్రవరిలో వస్తున్న అగ్ర సినిమాలు చూసుకుంటే.. అజిత్ పట్టుదల(విడ ముయర్చి)తో పాటు నాగ చైతన్య తండేల్, విశ్వక్ సేన్ లైలా వంటి సినిమాలు సందడి చేయబోతున్నాయి. అయితే ఈ వారం ఏఏ సినిమాలు థియేటర్‌తో పాటు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి అనేది ఒకసారి చూసుకుందాం.
అజిత్ – పట్టుదల
Vidaamuyarachi
తమిళ అగ్ర నటుడు అజిత్ ప్రస్తుతం కార్ రేసింగ్ పోటీల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రీసెంట్గా దుబాయ్‌లో జరిగిన కార్ రేసింగ్ పోటీల్లో మూడో స్థానంలో నిలిచి సత్తాచాటింది అజిత్ రేసింగ్ జట్టు. దీంతో నటుడిగానే కాకుండా రేసర్‌గా రాణించిన అజిత్‌పై ప్రశంసలు కురిపించారు ప్రముఖులు. ఇదిలావుంటే ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘విడాముయర్చి’ (Vidaa Muyarchi). తెలుగులో పట్టుదల (Pattudala) పేరుతో విడుదల చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాకు మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తుండగా.. త్రిష (Trisha) కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రం ఫిబ్రవరి 06న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
తండేల్
నటుడు అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం తండేల్ (Thandel). మలయాళీ బ్యూటీ సాయి పల్లవి కథనాయికగా నటిస్తుండగా.. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గుజరాత్లో చేపల వేటకు వెళ్లి పాకిస్థాన్ కోస్ట్ గార్డులకు చిక్కిన జాలర్ల కథ ఆధారంగా ఈ సినిమా రాబోతుండగా.. ఈ చిత్రం ఫిబ్రవరి 07న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఒక పథకం ప్రకారం
అగ్ర దర్శకుడు పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ (Sairam Shankar) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఒక పథకం ప్రకారం (Oka Pathakam Prakaaram). తమిళ నటుడు సముధ్రఖని ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుండగా.. సస్పెన్స్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రానికి వినోద్ కుమార్ విజయన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 07న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాలో ఫస్ట్ రోజు విలన్ కనిపెట్టినవారికి బంపరాఫర్ ప్రకటించింది చిత్రయూనిట్. ఫస్టాఫ్ అయిన అనంతరం ఈ సినిమాలో విలన్ ఎవరో కనిపెడితే రూ.10 వేలు బహుమానంగా ఇచ్చేలా 50 థియేటర్లలో పోటీ నిర్వహిస్తున్నట్టు టీమ్ ప్రకటించింది.
అనుజా
ప్రతిష్టాత్మక 97 ఆస్కార్ పోటీల్లో ‘లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్’ కేటగిరిలో చోటు దక్కించుకున్న భారతీయ లఘుచిత్రం. ‘అనుజా’ (Anuja). చైల్డ్ లేబర్ స్టోరీ ఆధారంగా వచ్చిన ఈ సినిమాకు ఆడమ్ జే గ్రేవ్స్ దర్శకత్వం వహించగా.. బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించింది. ఈ చిత్రం తాజాగా ఓటీటీ లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 5 నుంచి హిందీ భాషలో స్ట్రీమింగ్ కానుంది
ఓటీటీ
డిస్నీ+ హాట్‌స్టార్
కోబలి (తెలుగు వెబ్‌సిరీస్): ఫిబ్రవరి 4
సోనీలివ్
బడా నామ్ కరేంగే (హిందీ వెబ్‌సిరీస్): ఫిబ్రవరి 7
జీ 5
మిసెస్ (హిందీ సినిమా): ఫిబ్రవరి 7
ప్రైమ్ వీడియో
ది మెహతా బాయ్స్ (హిందీ మూవీ): ఫిబ్రవరి 7
నెట్‌ఫ్లిక్స్
సెలబ్రిటీ బేర్ హంట్ (వెబ్‌సిరీస్): ఫిబ్రవరి 5
ప్రిజన్ సెల్ 211 (వెబ్‌సిరీస్): ఫిబ్రవరి 5
ది ఆర్ మర్డర్స్ (వెబ్‌సిరీస్): ఫిబ్రవరి 6