Theatres Bandh | తెలంగాణ, ఏపీకి చెందిని మూవీ ఎగ్జిబీటర్లు ఆదివారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై అద్దె ప్రాతిపదికన సినిమాలను ప్రదర్శించలేమని, పర్సంటేజ్ రూపంలో చెల్లిస్తేనే ప్రదర్శన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్లను మూసివేయాలని నిర్ణయించారు. తెలుగు ఫిల్మ్ చాంబర్లో ఆదివారం ఎగ్జిబిటర్లు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నిర్మాతలు దిల్ రాజు, దగ్గుబాటి సురేశ్‌బాబు పాల్గొన్నారు.
వాస్తవానికి ఎగ్జిబిటర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు మధ్య పర్సంటేజీల విషయంలో చాలాకాలంగా చర్చ కొనసాగుతుండగా.. ప్రస్తుతం అద్దెల రూపంలో సినిమాలను ప్రదర్శించడం సాధ్యం కాదని ఎగ్జిబిటర్లు పేర్కొంటున్నారు. పర్సంటేజీలు ఇవ్వడం తమకు సాధ్యం కాదని డిస్ట్రిబ్యూటర్లు పేర్కొంటున్నారు. ఇది నిర్మాతలకు ఇబ్బందికరంగా మారంది. ఈ క్రమంలో ఏర్పాటైన ఎగ్జిబిటర్ల సంయుక్త సమావేశంలో పర్సంటేజీ, ప్రభుత్వ విధానాలపై చర్చించి.. నిర్మాతలకు లేఖ రాయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఈ అంశం టాలీవుడ్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. త్వరలో విడుదలయ్యే సినిమాలపై ఈ ప్రభావం పడే అవకాశం ఉంది.