The Wild Robot | హాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థ యూనివర్సల్ పిక్చర్స్(Universal Pictres) నుంచి మరో క్రేజీ మూవీ రాబోతుంది. ప్రముఖ ఇంగ్లీష్ రచయిత పీటర్ బ్రౌన్ (Peter Brown) యొక్క 2016 బెస్ట్ సెల్లింగ్ బుక్ ‘ది వైల్డ్ రోబోట్’ (The Wild Robot ). ఈ బుక్‌ను యానిమేషన్ రూపంలో తీసుకురాబోతుంది యూనివర్సల్ పిక్చర్స్. లుపిటా న్యోంగో, పెడ్రో పాస్కల్, కేథరీన్ ఓ’హారా, బిల్ నిఘీ, ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈ చిత్రానికి క్రిస్ సాండర్స్ (Chris Sanders) దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం గ్రాఫిక్స్ పనుల్లో బిజీగా ఉంది.
ఇదిలావుంటే.. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు. ఇక ఈ ట్రైలర్ గమనిస్తే.. అనుకోకుండా ఒక ఐలాండ్‌లో కొట్టుకువస్తుంది రోబోట్. అయితే రోబోట్‌ను చూసిన జంతువులు తనని వింతగా చూస్తుంటాయి. అయితే ఐలాండ్‌లో ఇరుక్కుపోయిన రోబోట్ అక్కడి జంతువులతో ఎలా కలిసిపోయింది. అసలు ఆ రోబోట్ అలా ఎక్కడకు వచ్చింది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఫుల్ యాక్షన్ అడ్వెంచర్‌గా సాగిన ఈ ట్రైలర్ ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ట్రైలర్ చివరిలో ”కొన్నిసార్లు బ్రతకడానికి మనం ప్రోగ్రామ్ చేయబడిన దానికంటే ఎక్కువగా ఉండాలి”. అని రోబో చెప్పే డైలాగ్ ట్రైలర్‌కే హైలైట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది.