The Vaccine War Trailer | ది కశ్మీర్ ఫైల్స్ (The Kashmir Files) సినిమాతో వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri) సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు. చిన్న సినిమాగా రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర కళ్లు చెదిరే కలెక్షన్లు కొల్లగొట్టింది. గతేడాది ఫిబ్రవరి చివరి వారంలో రిలీజైన ఈ సినిమా ఏకంగా రూ.350 కోట్లు కొల్లగొట్టి హిందీ నాట సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఇక ఇప్పుడదే దర్శకుడి నుంచి వస్తున్న మరో సినిమా ది వాక్సిన్ వార్ (The Vaccine War). ఇప్పటికే రిలీజైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను వదిలారు.
ఏ సమయంలోనైనా ది వాక్సిన్ వార్ ట్రైలర్ రావచ్చొంటూ మేకర్స్ నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్లుగానే మంగళవారం రాత్రి ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ గమనిస్తే.. కరోనా టైమ్‌లో జరిగిన పరిస్థితులు, వ్యాక్సిన్స్ కోసం ఇండియా తీసుకున్న చర్యలు, దేశంలో ఏర్పడ్డ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ ట్రైలర్ చూసిన నెటిజన్లు ది కశ్మీర్ ఫైల్స్ సినిమాలానే ఇది కూడా ప్రాపగాండ సినిమా అని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ దిగ్గజాలు నానా పటేకర్, అనుపమ్ ఖేర్‌లతో పాటు కాంతారా ఫేమ్ సప్తమీ గౌడ, ది కశ్మీర్ ఫైల్స్ నటులు పల్లవి జోషి, రైమా సేన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
‘THE VACCINE WAR’: VIVEK AGNIHOTRI LAUNCHES TRAILER… After the #Blockbuster run of #TheKashmirFiles, #VivekRanjanAgnihotri’s next film – titled #TheVaccineWar – arrives in *cinemas* on 28 Sept 2023… Here’s #TheVaccineWarTrailer…
Stars #NanaPatekar, #PallaviJoshi, #RaimaSen,… pic.twitter.com/IxZBnPKJj6
— taran adarsh (@taran_adarsh) September 12, 2023
ది కశ్మీర్ ఫైల్స్ సినిమాను నిర్మించిన పల్లవి జోషినే ఈ సినిమాను కూడా నిర్మిస్తుంది. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 28న పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాబోతుంది. కాగా సలార్ రిలీజ్ డేట్ ప్రకటించిన తర్వాతే ఈ సినిమా కూడా అదే డేట్‌పై రావడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చలే జరిగాయి. అయితే ఇప్పుడు సలార్ పోస్ట్ పోన్ అయింది. దాంతో ఈ సినిమా హిందీలో సోలోగానే రిలీజవుతుంది.