సంతోష్ కల్వచర్ల, క్రిషిక పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆర్టిస్ట్’. రతన్ రిషి దర్శకుడు. జేమ్స్ వాట్ కొమ్ము నిర్మాత. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. ఇటీవల ఈ సినిమా ఫస్ట్‌గ్లింప్స్‌ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ కథలో థ్రిల్లర్ అంశాలతో పాటు లవ్, డార్క్ కామెడీ కూడా ఉంటుంది. ప్రతీ సన్నివేశం ఆసక్తిని పంచుతుంది. ఇప్పటివరకు రానటువంటి వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో ఆకట్టుకుంటుంది’ అన్నారు.
‘కాన్సెప్ట్ బాగా నచ్చడంతో కథ కూడా వినకుంగా చిత్ర నిర్మాణానికి ముందుకొచ్చాను. ఈ సినిమాకు టాలెంటెడ్ ఆర్టిస్టులతో పాటు మంచి టెక్నీషియన్స్ కుదిరారు’ అని నిర్మాత తెలిపారు. తనికెళ్ల భరణి, సత్యం రాజేష్, ప్రభాకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: చందు ఏకే, సంగీతం: సురేష్ బొబ్బిలి, రచన-దర్శకత్వం: రతన్ రిషి.