హీరో మాధవన్ ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, కథా రచయితగా రాణిస్తున్నారు. తమిళంతో పాటు హిందీ, ఇంగ్లీష్ చిత్రాల్లో కూడా నటించి విజయాలందుకున్నారు. ఆయన నటించి దర్శకత్వం వహించిన ‘రాకెట్రీ’ చిత్రం ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డులో ఉత్తమ చిత్రంగా పురస్కారాన్ని గెలుచుకున్న విషయం తెలిసిందే.
ఇదిలా వుండగా మాధవన్ నటిస్తున్న తాజా తమిళ చిత్రానికి ‘అదృష్టశాలి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘తిరు’ వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని తీసిన మిత్రన్ జవహర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి మాధవన్ కథనందించడం విశేషం. ప్రస్తుతం విదేశాల్లో చిత్రీకరణ జరుగుతున్నది.