Kangana Ranaut | కంగనా రనౌత్ కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సినిమా ‘తను వెడ్స్ మను’. కథానాయికగా కంగనాకు స్టార్ స్టేటస్‌ని కట్టబెట్టిన సినిమా ఇదే. ఇందులో కంగనా, మాధవన్‌ల నటనను ఎవరూ మరిచిపోలేరు. ఆనంద్ ఎల్.రాయ్ తెరకెక్కించిన ఈ చిత్రానికి నేటికీ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ కూడా మంచి హిట్ అయిన విషయం తెలిసిందే.
త్వరలో ‘తను వెడ్స్ మను’ మూడో పార్ట్ రానున్నట్లు బీటౌన్‌లో వార్తలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో.. ఆ వార్తలు నిజమేననీ, పార్ట్ 3కి సన్నాహలు జరుగుతున్నాయని దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ క్లారిటీ ఇచ్చేశారు. ఈ సినిమా విషయంలో ఆసక్తిని రేకెత్తిస్తున్న మరో విషయం ఏంటేంటే.. ఈ మూడో పార్ట్‌లో కంగనా ఏకంగా త్రిపాత్రాభినయం చేస్తున్నదట. మూడు భిన్నమైన పాత్రల్లో ఆమె కనిపించనున్నట్టు బాలీవుడ్ మీడియా కోడై కూస్తున్నది. ఇది కంగనా అభిమానులకు నిజంగా శుభవార్తే.