The Thaandavam Lyrical Video | నందమూరి బాలకృష్ణ అంటే ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీ, పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ ఇంపాక్ట్ తప్పక గుర్తుకు వస్తాయి. స్క్రీన్ మీద కనిపిస్తే థియేటర్లు దద్దరిల్లుతాయి. ఇప్పుడు అదే ఎనర్జీని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి బాలయ్య ‘అఖండ 2 : తాండవం’ తో సిద్దమవుతున్నాడు. బోయపాటి శ్రీను – బాలయ్య కాంబినేషన్ అంటే ఎలాంటి స్థాయి హడావిడి జరుగుతుందో ప్రేక్షకులు బాగా తెలుసు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌తో అఖండ సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
శివతాండవం చేస్తున్నట్టుగా బాలయ్య అద్భుతమైన లుక్ ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్‌కి సోషల్ మీడియాలో అద్భుత స్పందన వచ్చింది. ఆ తర్వాత వచ్చిన టీజర్ మరింత సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాలయ్య పవర్, బోయపాటి స్టైల్ ఎలివేషన్స్, తమన్ బ్లాస్టింగ్ బీజీఎం అన్ని కలిపి సినిమాపై అంచనాలు రెట్టింపు చేసింది. పాన్ ఇండియా ఆడియన్స్ కూడా ఈ సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమాపై భారీ అంచనాల నడుమ ఇప్పుడు మేకర్స్ ముంబై పీవీఆర్ జుహూలో ‘అఖండ 2’ ఫస్ట్ సింగిల్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఇప్పటి వరకు బాలయ్య సినిమాలు హైదరాబాద్ లేదా ఆంధ్రా/తెలంగాణలో ప్రమోషన్స్ చేసేవి. కానీ ఈసారి పాన్ ఇండియా టార్గెట్‌తో నేరుగా ముంబైలో ఈవెంట్ ప్లాన్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇదే ఈవెంట్‌తో సినిమా ప్రమోషన్స్ దేశవ్యాప్తంగా అధికారికంగా ప్రారంభం కానున్నాయి.
సంగీత దర్శకుడు ఎస్.తమన్ మొదటి భాగంలో అందించిన BGM ఇప్పటికీ కల్ట్ లెవెల్ లో ఉంది. ఈసారి కూడా అఖండ రేంజ్‌ను మించిపోయేలా సౌండ్ డిజైన్, BGM, పాటల్లో తన బెస్ట్ ఇచ్చాడు. నాలుగు నిమిషాల పాటు సాగిన ఈ పాటలో బాలకృష్ణ పవర్ ఫుల్ లుక్‌లో కనిపిస్తూ ప్రేక్షకులకి మంచి అనుభూతి అందించాడు. బాలయ్య మాస్ ఇంపాక్ట్‌ను థియేటర్లలో ఎన్నడూ లేని విధంగా అనుభూతి చెందించేలా తమన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు అర్ధమవుతుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘అఖండ 2 : తాండవం’ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. రిలీజ్‌కు ముందే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో “తాండవం మొదలైంది” అంటూ భారీ ట్రెండ్ సృష్టిస్తున్నారు.