Game Changer | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్‌తో పాటు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో గేమ్‌ఛేంజర్ (Game changer) ఒకటి. టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ (Ram Charan), తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబోలో ఈ సినిమా రానుండటంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాను 2024 క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్.
అయితే ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ‘రా మచ్చా మచ్చా’ (Raa Macha Macha) అనే పాట ప్రోమోను సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఫుల్ సాంగ్‌ను ఎప్పుడు విడుదల చేస్తుంది అనేది మాత్రం ప్రకటించలేదు. అనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాటకు థమన్ సంగీతం అందించాడు. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమాలోని మ్యూజిక్కు సంబంధించి ది సౌండ్స్ ఆఫ్ ‘గేమ్ ఛేంజర్’ పేరిటా థమన్ ఒక వీడియో పంచుకున్నాడు. ఈ వీడియోలో దర్శకుడు శంకర్‌తో థమన్ ‘గేమ్ ఛేంజర్’ ఎంట్రీ సాంగ్ గురించి ఈ వీడియోలో మాట్లాడటం చూడవచ్చు.