The Seven Dogs | బాలీవుడ్ స్టార్ నటులు సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ ఒక హాలీవుడ్ సినిమాలో కనిపించబోతున్నారు. వీరిద్దరూ కలిసి నటిస్తున్న హాలీవుడ్ చిత్రం 7 డాగ్స్(7 dogs). ఈ సినిమాలో ఈజిప్టియన్ స్టార్స్ కరీమ్ అబ్దుల్ అజీజ్, అహ్మద్ ఎజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. ‘బ్యాడ్ బాయ్స్ ఫర్ లైఫ్’, ‘మిస్ మార్వెల్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆదిల్ ఎల్ అర్బీ, బిలాల్ ఫల్లాహ్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సౌదీ అరేబియన్ యాక్షన్-కామెడీగా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు.
ఈ టీజర్ చూస్తుంటే.. అంతర్జాతీయంగా ఉన్న డ్రగ్ సిండికేట్‌ను అరికట్టడానికి ఇంటర్‌పోల్ ఆఫీసర్ ఒక నేరస్తుడితో చేతులు కలపిన అనంతరం ఏం జరిగింది అనే స్టోరీతో ఈ సినిమా రాబోతుంది. ఇందులో సల్మాన్ ఖాన్ వైట్ బ్లేజర్లో ఆకట్టుకోగా.. సంజయ్ దత్ గన్ పట్టుకొని ప్రమాదకరమైన లుక్‌లో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ టీజర్‌ను మీరు చూసేయండి.