విరాట్కర్ణ హీరోగా నటిస్తున్న చిత్రం ‘నాగబంధం’. అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కిషోర్ అన్నపురెడ్డి నిర్మిస్తున్నారు. మంగళవారం ప్రీలుక్ పోస్టర్ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతున్నది. ‘పద్మనాభస్వామి, పూరీ జగన్నాథ్ దేవాలయాల వద్ద కనుగొన్న గుప్త నిధుల వార్తల నుంచి ప్రేరణ పొంది.. ఆధ్యాత్మిక, సాహసభరిత అంశాలతో దర్శకుడు ఈ కథను సిద్ధం చేశారు.
ఈ పవిత్ర స్థలాలను రక్షించే నాగబంధం గురించిన ఆసక్తికరమైన అంశాలతో పాటు, దేశంలోని 108 విష్ణు దేవాలయాల చుట్టూ ఉన్న రహస్యాలను ఈ సినిమాలో ఆవిష్కరిస్తున్నాం. అత్యున్నత సాంకేతిక హంగులతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలోని విజువల్స్ ప్రేక్షకుల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్కు సన్నాహాలు చేస్తున్నాం’ అని మేకర్స్ తెలిపారు. నభా నటేష్, ఐశ్వర్యమీనన్, జగపతిబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సౌందర్ రాజన్, సంగీతం: అభే, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: అభిషేక్ నామా.