The Road Movie | చిత్రసీమలో దాదాపు రెండు దశాబ్దాలుగా రాణిస్తున్నది స్టార్ హీరోయిన్ త్రిష (Trisha Krishnan). ఇక ఇటీవల విడుదలైన ‘పొన్నియన్ సెల్వన్’ 1, 2 చిత్రాలు ఆమెకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చాయి. ప్రస్తుతం త్రిష నటిస్తున్న తాజా లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘ది రోడ్’ (The Road). రివెంజ్ ఇన్ 462 కిలోమీటర్స్ (Revenge in 462 kms) అనేది ఉప శీర్షిక. తమిళనాడులోని జాతీయ హైవేలపై జరిగిన కొన్ని యథార్థ సంఘటనల స్ఫూర్తితో దర్శకుడు అరుణ్ వసిగరణ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మేకింగ్ టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్లు మూవీపై అంచనాలను ఓ రేంజ్ లో పెంచేశాయి. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌కు సంబంధించి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
ఈ మూవీని పాన్ ఇండియా లెవల్లో అక్టోబరు 06 న విడుదల చేయనున్నట్లు మేకర్స్ సోషల్ మీడియాలో వెల్లడించారు. దీనితో పాటు ఒక వీడియో కూడా విడుదల చేశారు. ఇక యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్న ఈ సినిమాలో సార్పట్టా పరంపర ఫేమ్ షబీర్ (డ్యాన్సింగ్ రోస్), సంతోష్ ప్రతాప్, మియా జార్జ్ తదితరులు కీ రోల్స్ ప్లే చేస్తున్నారు.
The countdown begins – Are you ready for the sweetest🥰, deadliest😈 revenge of your life? Fasten your seatbelts! https://t.co/4WCfP3boXa
The Road, hitting screens on October 6th! #RevengeFromOct6#TheRoad@trishtrashers @Arunvaseegaran1 @SamCSmusic
— AAA_cinemaa (@aaa_cinemaa) September 8, 2023