రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్ జంటగా నటిస్తున్న ‘మోగ్లీ’ చిత్ర విడుదల ఒక్కరోజు వాయిదా పడింది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈ నెల 12న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని 13వ తేదీకి వాయిదా వేసినట్లు మేకర్స్ ప్రకటించారు. అడవి నేపథ్యంలో జరిగే ఈ కథలో తన ప్రేమకోసం ఓ యువకుడు చేసే పోరాటాన్ని ఆవిష్కరించారు. హృదయానికి హత్తుకునే ప్రేమకథా చిత్రమిదని, పోరాట ఘట్టాలు ప్రధానాకర్షణగా నిలుస్తాయని మేకర్స్ తెలిపారు. బండి సరోజ్‌కుమార్, హర్ష చెముడు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ, నిర్మాణ సంస్థ: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,
నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, కృతిప్రసాద్, రచన-దర్శకత్వం: సందీప్‌రాజ్.