Prabhas | రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం ప్రభాస్‌కి మంచి హిట్ అందిస్తుందని అభిమానులు విశ్వసిస్తున్నారు.గత కొద్ది రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంకి సంబంధించిన టీజర్ విడుదల కానుందంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. మే రెండో వారంలో ‘ది రాజా సాబ్’ టీజర్ వస్తుందని చాలా రోజులుగా టాక్ వినిపించింది. దర్శకుడు మారుతి సైతం మే నెల మధ్యలో వేడి తరంగాలు ఎక్కువ అవుతాయంటూ అప్పట్లో ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ముందు టీజర్ పట్ల ఆసక్తి నెలకొంది.
ది రాజా సాబ్ కోసం ఇపుడు వరకు ఎలాంటి అప్డేట్ మళ్ళీ లేదు. ఇక ఫైనల్ గా అసలు టీజర్ ఉందా లేదా అనే అనుమానాలు అందరిలో మెదులుతున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ సమయంలో ది రాజా సాబ్ టీజర్ విడుదల చేయనున్నారని అంటున్నారు. హరిహర వీరమల్లు చిత్రం జూన్ 12న విడుదల కానుండగా, ఆ సమయంలో ది రాజా సాబ్ టీజర్ రిలీజ్ చేయనున్నారని అంటున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్ , నిధి అగర్వాల్ , రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా, తమన్ ఈ పాన్ ఇండియా సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్ , నిధి అగర్వాల్ , రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా, తమన్ ఈ పాన్ ఇండియా సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మంచి అవుట్ పుట్ తీసుకురావడానికి దర్శకుడు మారుతి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు.ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను ముందు నుంచి ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నట్లు చెప్పుకుంటూ వచ్చారు. అయితే.. వీఎఫ్ఎక్స్ గట్రా ఇంకా పెండింగ్ ఉండటంతో పోస్ట్ పోన్ అయింది.ఇక ఇప్పుడు ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేయాలని మేకర్స్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.