ప్రభాస్ వంటి పాన్ ఇండియా హీరోతో సాధారణ హారర్ కామెడీ చేయొద్దనుకున్నామని, ఫాంటసీ.. సైకలాజికల్ ఎలిమెంట్స్ జతచేసి లార్జ్ స్కేల్లో సినిమా చేశామని చెప్పారు ‘ది రాజాసాబ్’ చిత్ర దర్శకుడు మారుతి. ఆయన నిర్ధేశకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా శుక్రవారం దర్శకుడు మారుతి విలేకరులతో మట్లాడారు.