Prabhas – Raaja Saab | ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ది రాజా సాబ్ (Raaja Saab). మారుతి దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుండగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్. అయితే ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. జూన్ 16న టీజర్ విడుదల చేయనున్నారు మేకర్స్. తాజాగా దీనికి సంబంధించి మరో అప్డేట్ను ప్రకటించారు. ఈ సినిమా టీజర్‌ను రేపు ఉదయం 10.52 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ సందర్భంగా ప్రీ టీజర్ ప్రోమోను పంచుకుంది.