శ్రీరామ్, మౌనిక జంటగా నటిస్తున్న చిత్రం ‘అనుకున్నవన్ని జరగవు’. జి.సందీప్ దర్శకుడు. శ్రీ భారత ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ సినిమా పోస్టర్‌ను శుక్రవారం హీరో అల్లరి నరేష్ విడుదల చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘క్రైమ్ కామెడీ థ్రిల్లర్ చిత్రమిది.
అనూహ్య మలుపులతో కథ సాగుతుంది. వినోదానికి పెద్దపీట వేశాం. నటీనటులు కొత్తవారైనా చక్కటి పర్ఫార్మెన్స్ కనబరిచారు’ అని అన్నారు. పోసాని కృష్ణమురళి, కిరీటి, మిర్చి హేమంత్, గౌతమ్‌రాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: చిన్నా రామ్, జీవీ అజయ్, సంగీతం: గిడియన్ కట్ట, కథ, దర్శకత్వం: జి.సందీప్.