Housefull 5 | బాలీవుడ్లో నవ్వుల పూయించిన ‘హౌస్‌ఫుల్’ ఫ్రాంచైజీ నుంచి తాజాగా మరో చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీ నాలుగు చిత్రాలు రాగా.. తాజాగా 5వ చిత్రం (Housefull 5A, Housefull 5B) అంటూ రెండు పార్టులుగా రాబోతుంది. ఈ రెండు చిత్రాలలో భిన్నమైన క్లైమాక్స్ ఉండబోతున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్‌ముఖ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. తరుణ్ మన్సుఖానీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. నడియాడ్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సాజిద్ నడియాడ్వాలా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం జూన్ 06న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సందర్భంగా మూవీ నుంచి ది ఫుగ్డీ డ్యాన్స్ (The Phoogdi Dance) అనే పాటను విడుదల చేశారు మేకర్స్. ఈ పాటలో నానా పటేకర్, అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితీష్ దేశ్‌ముఖ్ సహా చిత్రబృందం మొత్తం పాల్గొని తమదైన ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో అదరగొట్టారు. క్రేటెక్స్ ఈ పాటను పాడగా, తనిష్క్ బాగ్చి మరియు క్రేటెక్స్ సంగీతం అందించారు.