The Paradise | హిట్ 3తో సూపర్ హిట్ అందుకున్న నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ది ప్యారడైజ్(The Paradise). దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి అనౌన్స్మెంట్ టీజర్‌ను విడుదల చేయగా.. మంచి స్పందన లభించింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ నాని ఫస్ట్ లుక్‌తో పాటు సినిమాలో నాని పాత్రను రివీల్ చేశారు మేకర్స్. ఈ మూవీలో నాని జడల్(Jadal) అనే పాత్రలో కనిపించబోతున్నట్లు చిత్రబృందం రాసుకోచ్చింది.
ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ మరియు స్పానిష్ భాషల్లో వచ్చే ఏడాది (2026) మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రం 1980ల కాలంలో హైదరాబాద్‌లో జరిగిన కొన్ని నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోంది.
Presenting to you all – ‘Jadal’.
This time, my hero, @NameisNani anna ❤️ will walk into hell and turn it into #TheParadise
March 26th, 2026 in Cinemas Worldwide. pic.twitter.com/LNtUz9hOkH
— Srikanth Odela (@odela_srikanth) August 8, 2025