Srikanth Odela – Nani | స్టార్ కథానాయకుడు నాని ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే హిట్ 3 సినిమాను విడుదలకు సిద్ధం చేసిన నాని తనకి దసరా లాంటి బ్లాక్ బస్టర్‌ను అందించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela)తో ‘ది ప్యారడైజ్’ (The Paradise) అనే సినిమా చేయబోతున్నాడు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.
ఇదిలావుంటే ఈ మూవీని ఎనిమిది భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ అనౌన్స్మెంట్ టీజర్‌ని మార్చి 03న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తుండగా.. ఈ టీజర్ ఎనిమిది భాషల్లో(తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, కన్నడ, ఇంగ్లీష్, స్పానిష్) విడుదల కాబోతున్నట్లు తెలుస్తుంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన మార్చి 03నే ఇవ్వబోతున్నట్లు సమాచారం.
A grand, bold and a very wild statement of announcement by Srikanth.
Be hyped for #TheParadise video. pic.twitter.com/3FTg8uj5xM
— Navin Nooli (@NavinNooli) February 26, 2025