Nani | హీరో నాని ప్రధాన పాత్రలో, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ ది ప్యారడైజ్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి వస్తున్న అప్డేట్స్ అభిమానులలో ఆసక్తిని పెంచుతుంది. మూవీ ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచే ఈ సినిమా పట్ల అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రతి అప్డేట్తో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతూ వస్తున్న చిత్ర బృందం, ఇటీవలే నానికి సంబంధించిన రెండు కొత్త పోస్టర్లను విడుదల చేశారు. తాజాగా ఓ మేకింగ్ వీడియోను కూడా షేర్ చేశారు.
ఈ సినిమాలో నాని జడల్ అనే పాత్రలో నటిస్తున్నారు. రగ్గడ్ లుక్, గుబురు గడ్డం, రెండు జడలతో నాని ఎన్నడూ కనిపించని విధంగా కనిపించగా, ఈ గెటప్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. మేకింగ్ వీడియోలో తన రెండు జడలను ముట్టుకుంటే జడల్ కి సర్రుమంటుందని మేకింగ్ వీడియో ద్వారా తెలియజెప్పారు. ఓ హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ పూర్తి చేసిన సందర్భంగా చిత్ర బృందం ‘స్పార్క్ ఆఫ్ ది ప్యారడైజ్’ వీడియోని విడుదల చేశారు. జైలు బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సీన్లో నాని తోటి ఖైదీలతో ఘర్షణ పడే సన్నివేశం ఉంటుందని తెలుస్తోంది.
ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.. ఎప్పుడైతే హీరో ఒకటీ రెండు అని డిప్స్ కొడుతుంటాడో.. అక్కడి నుంచి వీళ్ళందరూ రచ్చ రచ్చ చేస్తారు.. నాలుగొందల తొంబై తొమ్మిది అనే సౌండ్ మాత్రమే వినిపిస్తుంది అంటూ సీన్ ని ఎక్స్ ప్లెయిన్ చేస్తూ కనిపించారు. అంతేకాదు నాని మాదిరిగా రెండు జడలతో కనువిందు చేశారు. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది .ఇక ‘ది ప్యారడైజ్ మూవీ 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో విడుదల కానుంది.
We went all in.
We are ready to go all out now.Wrapped up an intense one.
Gearing up for the next schedule.#TheParadise https://t.co/WsHdXv7Mt5@odela_srikanth 🔥@anirudhofficial 🔥 pic.twitter.com/xJ4Mjr3ZZb— Nani (@NameisNani) August 11, 2025