Allu Arjun | అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కనున్న పాన్ వరల్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం ప్రిపరేషన్స్ మొదలయ్యాయి. కొద్దిరోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ‘పుష్ప’ ఫ్రాంచైజీ తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రమిదే కావడంతో దేశావ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు అట్లీ తనదైన శైలి మాస్, యాక్షన్ అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని తెలిసింది.
ఈ సంవత్సరాంతంలో ఈ సినిమా సెట్స్‌మీదకు రానుంది. ఈ సినిమా ప్రిపరేషన్లో భాగంగా కొద్దిరోజుల క్రితం హీరో అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ ముంబయి వెళ్లారు. త్వరలో అల్లు అర్జున్ పాత్రకు సంబంధించిన లుక్‌టెస్ట్, కాన్సెప్ట్ షూట్‌ను తీయబోతున్నారని తెలిసింది. అల్లు అర్జున్ లుక్ విషయంలో దర్శకుడు అట్లీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడని, రెండుమూడు ఆప్షన్స్‌ను పరిశీలిస్తున్నారని సమాచారం. సైన్స్ ఫిక్షన్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని, భారతీయ సినిమాలో ఇప్పటివరకు రాని వినూత్నమైన కాన్సెప్ట్ ఇదని చెబుతున్నారు.