కరువు నేల రాక్షసుడు
అగ్ర హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నది.
అగ్ర హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నది. సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయనున్నారు. ఇదిలావుంటే.. ఈ భారతీయ సినిమాలో ప్రముఖ హాలీవుడ్ నటుడు ‘ది మమ్మీ’ఫేం ఆర్నాల్డ్ వోస్లూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులోని ఆయన పాత్ర పేరు ‘సర్ థియోడోర్ హెక్టర్’. మంగళవారం ఆర్నాల్డ్ వోస్లూ పుట్టినరోజు.
ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సినిమాలోని ఆయన పాత్రను పరిచయం చేస్తూ ఓ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. ‘కరవు నేల రాక్షసుడు.. సర్ థియోడోర్ హెక్టర్’ అంటూ ఈ పోస్టర్లో ఆయన పాత్రను పరిచయం చేశారు. 19వ శతాబ్దంలోని బ్రిటీష్ పాలనాకాలంలో తెలుగునేలపై ఏర్పడ్డ ‘డొక్కల కరువు’ నేపథ్యంలో యథార్థ సంఘటనల ఆధారంగా ‘రణబాలి’ సినిమా తెరకెక్కుతున్నట్టు వినికిడి. ఈ చిత్రానికి సంగీతం: అజయ్-అతుల్, సమర్పణ: గుల్షన్‌కుమార్, భూషణ్‌కుమార్, టీసిరీస్ ఫిల్మ్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
France Riots: పారిస్‌లో 350 మందికిపైగా అరెస్టు.. అల్లర్లను నియంత్రించలేకపోయామన్న మంత్రి
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

