’వీరసింహా రెడ్డి’తో బాక్సాఫీస్ విస్పోటనమే
బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా ’వీరసింహా రెడ్డి’. శృతి హాసన్ నాయికగా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. గోపీచంద్ మలినేని దర్శకుడు. ఈ నెల 12న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది.
బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా ’వీరసింహా రెడ్డి’. శృతి హాసన్ నాయికగా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. గోపీచంద్ మలినేని దర్శకుడు. ఈ నెల 12న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలులో చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేదికపై చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ…’ఒక అభిమానిగా బాలకృష్ణతో సినిమా రూపొందించాను. ఆయన్ను తెరపై ఎలా చూడాలని కోరుకుంటామో అలా అన్ని కమర్షియల్ అంశాలతో సినిమా ఉంటుంది’ అన్నారు. నిర్మాత వై రవిశంకర్ మాట్లాడుతూ…’మేం సినిమాను ఇప్పటికే చూశాం. మీ అందరి అంచనాలు మించేలా సినిమా వచ్చింది. చిత్ర విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నాం’ అన్నారు.
బాలకృష్ణ మాట్లాడుతూ…’ఒక సినిమాలో అన్నీ సరిగ్గా కుదిరితే అది బాక్సాఫీస్ దగ్గర విస్పోటనం లాంటి విజయాన్ని అందిస్తుంది. అలాంటి చిత్రమే ’వీరసింహా రెడ్డి’. నా కెరీర్ లో ఇదొక గుర్తుండిపోయే సినిమాగా మారుతుందన్న నమ్మకం ఉంది. ప్రతి సినిమాతో ప్రేక్షకులకు కొత్తదనం అందించే ప్రయత్నం చేయాలనేది నా కోరిక. ఇదే దారిలో నా నట ప్రయాణం సాగిస్తా’ అన్నారు. ఈ కార్యక్రమంలో నాయిక శృతి హాసన్, నటులు దూనియా విజయ్, సప్తగిరి, అజయ్ ఘోష్, స్టంట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఎన్నికల వేళ చంద్రబాబు సర్కారు దుర్మార్గాలు చేస్తోంది : పేర్ని నాని
కూలీలు ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి: జడ్పీ సీఈవో నాగలక్ష్మి
‘టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి’
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

