అభినవ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ప్రేమలో..’. ‘పాపలు బాబులు’ ఉపశీర్షిక. శ్రీరాజ్ బల్లా దర్శకుడు. విజయమాధవి బల్లా నిర్మాత. ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదల కార్యక్రమం సీనియర్ నటుడు మురళీమోహన్ చేతులమీదుగా హైదరాబాద్లో జరిగింది. పేరుతోపాటు కాన్సెప్ట్ కూడా కొత్తగా ఉందని, సినిమా విజయం సాధించాలని మురళీమోహన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
సినిమా విజయం సాధించాలని అతిథులందరూ ఆకాంక్షించారు. ప్రేక్షకుల ఆశీర్వాదం ఉంటే మున్ముందు మరిన్ని మంచి సినిమాలు తీస్తామని నిర్మాత చెప్పారు. ఇంకా తుమ్మలపల్లి రామసత్యనారాయణ, నిర్మాత సాయివెంకట్, నటుడు సమీర్ తదితరులు పాల్గొన్నారు.