The 100 Movie | మొగలిరేకులు (Mogalirekulu) సీరియల్ ఫేమ్ ఆర్కే సాగర్ (Rk Sagar) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ది 100’(The 100 Movie). ఈ సినిమాకు రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహిస్తుండగా.. ధన్య బాలకృష్ణ, మిషా నారంగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. జూలై 11న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు మేకర్స్. ఈ సందర్భంగా చిత్రయూనిట్ వరుసగా ప్రమోషన్స్ నిర్వహిస్తుంది. ఈ ప్రమోషన్స్‌లో భాగంగానే తాజాగా చిత్రయూనిట్ చిరంజీవి తల్లి అంజనాదేవిని కలుసుకుంది. చిత్ర నటుడు ఆర్కే సాగర్‌కి అంజనాదేవి అభిమాని అన్న విషయం తెలిసిందే. మొగలిరేకులులో ఆర్కే నాయుడి పాత్రను అభిమానించేది అంజనాదేవి. ఈ విషయం తెలుసుకున్న ఆర్కే సాగర్ కూడా ఒకసారి వెళ్లి ఆమెని కలుసుకుని ఆశీర్వాదం తీసుకున్నాడు. అయితే తాజాగా 100 మూవీ విడుదలకు సిద్ధమవ్వడంతో ఈ మూవీ విజయవంతం అవ్వాలని అంజనాదేవి బ్లెస్సింగ్స్ తీసుకుంది చిత్రయూనిట్. ఇందుకు సంబంధించిన వీడియోను చిత్రబృందం తాజాగా పంచుకుంది.
ఈ సినిమాకు శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. అర్జున్ రెడ్డి, యానిమల్ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. గిరిధర్, ఆనంద్ (దొంగ దొంగ ఫేమ్), లక్ష్మీ గోపాల్ స్వామి (అరవింద సమేత ఫేమ్), కళ్యాణి నటరాజన్, బాలకృష్ణ, జయంత్, విష్ణు ప్రియ (యాంకర్) తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
The sweetest Mega mother, Smt. Konidela #AnjanaDevi garu, expresses her admiration for RK Naidu aka @urRksagar, as she is mesmerized by his fearless cop role in #The100Movie ❤️✨️#HeyMeghale song Out now🔥
▶️ https://t.co/jTmDRSaANi#The100 Grand Release on July 11th, 2025… pic.twitter.com/zUzNqx58MX— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) June 25, 2025