డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో విజయ్‌దేవరకొండ (Vijay Deverakonda) టైటిల్ రోల్ చేస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్టు లైగర్ (Liger). బాలీవుడ్ భామ అనన్యపాండే (Ananya Pandey) ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. తాజాగా ఈ ప్రాజెక్టు నుంచి అదిరిపోయే అప్ డేట్‌ను మేకర్స్ అందించారు. లైగర్ హంట్ థీమ్ టీజర్‌ను విడుదల చేశారు.
‘ధీన్ తక తక ధిన్నా..తక తక.. ధీన్ తక తక ధిన్నా..తక తక.. తక ధీన్ ధీన్ తక తక..బతకాలంటే గెలవాల్సిందే..’అంటూ గూస్ బంప్స్ తెప్పిస్తోంది లైగర్ హంట్ థీమ్ టీజర్. విక్రమ్ మోన్ట్రొసే కంపోజ్ చేసిన ఈ పాటను భాస్కర బట్ల రాశారు. హేమచంద్ర పాడాడు. తాజా టీజర్ సినిమా థీమ్‌ను ప్రతిబింబిస్తూ గూస్ బంప్స్ తెప్పిస్తోంది.
ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై అపూర్వ మెహతా, కరణ్ జోహార్, ఛార్మీ కౌర్, పూరీ జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కీ రోల్లో కనిపించబోతున్నాడు. లైగర్‌లో సీనియర్ నటి రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25న థియేటర్లలో విడుదల కాబోతుంది లైగర్.