ఆదివారం 09 ఆగస్టు 2020
Cinema - Jul 07, 2020 , 11:38:26

'జాను' సూప‌ర్ హిట్ సాంగ్ వీడియో విడుద‌ల

'జాను' సూప‌ర్ హిట్ సాంగ్ వీడియో విడుద‌ల

ఈ ఏడాది మొద‌ట్లో విడుద‌లై ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన చిత్రం జాను. తమిళ చిత్రం ‘96’ రీమేక్‌గా తెర‌కెక్కిన ఈ చిత్ర కథాంశంలో  ఎలాంటి మార్పులు చేయకుండా రూపొందించారు. అయితే తెలుగు ఇతివృత్తాన్ని 2004 నేపథ్యంలో చూపించారు. ఎలాంటి నాటకీయత లేకుండా సన్నివేశాలన్నింటిని సహజంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఒక్కరాత్రిలో రామచంద్ర, జాను చేసే ప్రయాణం..ఇద్దరి మధ్య అవ్యక్తమయ్యే భావాలు..ఈ క్రమంలో చెలరేగిన సంఘర్షణను అర్థవంతంగా ప్రజెంట్‌ చేశారు. అయితే కొన్ని సన్నివేశాలు సుదీర్ఘంగా సాగిన భావన కలుగుతుంది.  

శ‌ర్వానంద్, స‌మంత ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన ఈ చిత్రంకి మహేంద్రన్‌ జయరాజ్‌ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ప్రతి ఫ్రేమ్‌ను బ్యూటీఫుల్‌గా బంధించారు. సంగీత దర్శకుడు గోవింద వసంత..తమిళ ‘96’ బాణీలను రిపీట్‌ చేశారు. సంగీతం, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మెప్పిస్తుంది. అయితే దర్శకుడు సి.ప్రేమ్‌కుమార్‌ తమిళ వెర్షన్‌లో మ్యాజిక్‌ను పునరావృతం చేయడంలో స‌క్సెస్ కాలేక‌పోయారు. తాజాగా చిత్రం నుండి ది రియ‌ల్ లైఫ్ ఆఫ్ రామ్ వీడియో సాంగ్ విడుద‌ల చేశారు. ఈ వీడియో అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo