అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్ రాజకీయ కార్యకలాపాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు వేగంగా తన సినిమాల్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ‘ఓజీ’ తాలూకు నాలుగు రోజుల షూటింగ్ బ్యాలెన్స్‌గా ఉన్నట్లు తెలిసింది. ఈ చిత్రం దసరా బరిలో రాబోతుండటంతో అభిమానులు ఖుషీగా ఉన్నారు. మరోవైపు ‘ఉస్తాద్‌భగత్‌సింగ్’ తాజా షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది.
నేడు పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో పవన్‌కల్యాణ్ త్రీపీస్ సూట్‌పై కౌబాయ్ క్యాప్ ధరించి ైస్టెలిష్‌గా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ విడుదల చేసిన కొద్ది గంటల్లోనే సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. పవన్‌కల్యాణ్‌కు ‘గబ్బర్‌సింగ్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించిన దర్శకుడు హరీశ్‌శంకర్, మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేయబోతున్నారని అభిమానులు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.
ఈ నెల 6 నుంచి మొదలయ్యే కొత్త షెడ్యూల్లో పవన్‌కల్యాణ్‌తో పాటు ప్రధాన తారాగణం పాల్గొంటారని మేకర్స్ తెలిపారు. శ్రీలీల, రాశీఖన్నా, పార్థిబన్, కె.ఎస్.రవికుమార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, రచన-దర్శకత్వం: హరీష్‌శంకర్ ఎస్.