The Kerala Story | ఓటీటీలోకి ‘ది కేరళ స్టోరీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
The Kerala Story | సాధారణంగా థియేటర్లలో రిలీజైన సినిమాలు ఒకటి, రెండు నెలల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అయితే కొన్ని సినిమా మాత్రం నెలలు గడిచినా రావడంలేదు.
The Kerala Story | సాధారణంగా థియేటర్లలో రిలీజైన సినిమాలు ఒకటి, రెండు నెలల్లోనే ఓటీటీలోకి (OTT) వచ్చేస్తున్నాయి. అయితే కొన్ని సినిమా మాత్రం నెలలు గడిచినా రావడంలేదు. అలాంటివాటిలో అదా శర్మ నటించిన ‘ది కేరళ స్టోరీ’ (Ther Kerala Story) కూడా ఒకటి. అనేక వివాదాల మధ్య గతేడాది మే 5న ఈ సినిమా టాకీసుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం సాధించింది.

లవ్ జిహాద్ నేపథ్యంలో రూ.35 కేట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఊహించని విధంగా రూ.244.8 కోట్ల మేర రాబట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ విషయం చక్కర్లు కొడుతున్నది. దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఓటీటీలోకి విడుదల కానుందనే ఆ వార్త.. అయితే స్ట్రీమింగ్ ఎప్పుడనేది స్పష్టత రాలేదు. జనవరి 14న లేదా 17న ఓటీటీలోకి సందడి చేయనుందని తెలుస్తున్నది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5 ప్రసార హక్కులను సొంతం చేసుకున్నది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ అందుబాటులో ఉండనుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై అటు ఓటీటీ సంస్థ కానీ, చిత్ర నిర్మాతలు కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

కేరళలోని బాలికలను ఇస్లాం మతంలోకి మార్చి సౌదీకి తరలించారనే నేపథ్యంలో సుదీప్తో సేన్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో అదా శర్మతోపాటు యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ, సోనియా బలానీ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

