The Kashmir Files Collections | కంటెంట్ ఉంటే కథానాయకులతో పనిలేదు అంటూ ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రం నిరూపిస్తుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే మాట. గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఈ చిత్రం ట్రెండింగ్‌లో ఉంది. మార్చి11న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళ సునామీని సృష్టిస్తుంది. ఇటీవలే ఈ చిత్ర బృందాన్ని ప్రధాని మోడీ ప్రశంసించడం ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. మొదట ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 700 థియేటర్లలో విడుదలైంది. ఇక అదే రోజున ‘రాధేశ్యామ్’ చిత్రం కూడా విడుదలైంది. రాధేశ్యామ్ నెగటీవ్ టాక్ తెచ్చుకోవడంతో పలు థియేటర్ల నుంచి రాధేశ్యామ్ చిత్రాన్ని తొలిగించి ఈ చిత్రాన్ని ప్రదర్శితం చేస్తున్నారు. మొదటి రోజుతో పోలిస్తే రెండవ రోజు నుంచి ఈ చిత్రం దాదాపు 2000ల స్క్రీన్లలో అంటే రెట్టింపు కన్నా ఎక్కువ స్క్రీన్లలో ప్రదర్శితమవుతుంది.
మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, పల్లవి జోషి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి వివేక్ అగ్నిహోత్రీ దర్శకత్వం వహించాడు. కాశ్మీర్ పండిట్లపై జరిగిన సామూహిక హత్యకాండ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. 1990లో కాశ్మీర్ పండిట్లు ఏ విధంగా హింసించబడ్డారు? చంపబడ్డారు? వాళ్ళు స్వదేశం నుంచి బలవంతగా ఎలా బయటకు పంపబడ్డారు? అనే కథాంశంతో దర్శకుడు ఈ చిత్రాన్ని కళ్ళకు కట్టినట్టుగా తెరకెక్కించాడు. ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు 3.55 కోట్ల కలెక్షన్లను సాధిస్తే రెండవ రోజు ఏకంగా 8.50 కోట్ల రెట్టింపు కలెక్షన్లతో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది.
లేటెస్ట్గా మూడవరోజు ఈ చిత్రం ఏకంగా 15.10 కోట్ల కలెక్షన్లను సాధించి ఇండియన్ సినిమా చరిత్రలోనే మొదటిరోజు కన్నా మూడవరోజు కలెక్షన్లు ఐదురేట్లు పెరగడం అనేది ఈ సినిమాకు జరగింది. మెదటివారం పూర్తయ్యే సరికి ఈ చిత్రం టోటల్‌గా 27.15 కోట్ల కలెక్షన్లను సాధించింది. ఇక ఈ చిత్రానికి కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలు ఎంటర్టైనమెంట్ టాక్స్‌ను నిషేధించాయి.
\