శ్రీకాంత్, రవితేజ, ప్రకాశ్‌రాజ్ ప్రధానపాత్రధారులుగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘ఖడ్గం’ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. 22 ఏండ్ల క్రితం విడుదలైన ఈ చిత్రానికి నేటికీ అభిమానులున్నారు. త్వరలో ఈ సినిమా మళ్లీ రీరిలీజ్‌కి ముస్తాబవుతున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. భారతీయ జెండా ఒక ‘ఖడ్గం’ అనే ఉద్దేశంతో ఈ సినిమాకు ఆ పేరు పెట్టామని, ఆనాడు ఈ సినిమాకు అన్ని విధాలా సహకరించిన నిర్మాత మధుమురళికి ధన్యవాదాలు తెలుపుతున్నామని కృష్ణవంశీ అన్నారు. దేశభక్తి నేపథ్య చిత్రాలన్నింటిలో ‘ఖడ్గం’ గొప్ప సినిమాఅనీ, తన జీవితంలో మరిచిపోలేని సినిమా ఇదని హీరో శ్రీకాంత్ చెప్పారు. ఇంకా ఇందులో కీలక పాత్రలు పోషించిన శివాజీరాజా, షఫీ కూడా మాట్లాడారు.