Mani Ratnam and AR Rahman | దిగ్గజ దర్శకుడు మణిరత్నం తన ఆస్థాన సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్‌తో మరోసారి చేతులు కలుపబోతున్నాడు. 1992లో ‘రోజా’ సినిమాతో మొదలైన వీరిద్దరి అద్భుత ప్రయాణం, ఇప్పుడు 19వ సారి ఈ కొత్త సినిమాతో కొనసాగబోతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి హీరోగా నటించబోతుండగా.. ‘నేచురల్ స్టార్’ సాయి పల్లవి మణిరత్నం సినిమాలో హీరోయిన్గా నటించబోతుంది.
గత కొద్ది రోజులుగా ఈ సినిమాకు యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ పనిచేస్తారనే ప్రచారం జరిగినప్పటికీ, వాటన్నింటికీ చెక్ పెడుతూ మద్రాస్ టాకీస్ సంస్థ రెహమాన్ పేరును అధికారికంగా ప్రకటించింది. ఒక ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం రెహమాన్ ఇప్పటికే ఒక పాటను కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. మద్రాస్ టాకీస్ మరియు లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది జూలై నాటికి ప్రారంభం కానుంది.
Delighted to welcome @sonymusicsouth as the Audio Partner for #MadrasTalkiesProduction23 💫#Subaskaran presents
A #ManiRatnam Film
An @arrahman MusicalProduced by @LycaProductions @MadrasTalkies_#IndiaTalkies
Starring @VijaySethuOffl @Sai_Pallavi92 pic.twitter.com/li6hnVEJGJ
— Lyca Productions (@LycaProductions) March 20, 2026