The Great PreWedding Show | ‘మసూద’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తిరువీర్ హీరోగా, టీనా శ్రావ్య హీరోయిన్గా నటించిన తాజా చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. నవంబర్ 07న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి కామెడీ హిట్‌ను అందుకుంది. అయితే థియేటర్లలో అలరించిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో ఈ చిత్రం ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. రమేష్ (తిరువీర్) ఒక ఫొటోగ్రాఫర్, ఫొటోస్టూడియో నడుపుతుంటాడు. పంచాయతీ సెక్రటరీ హేమ (టీనా శ్రావ్య)ను ప్రేమిస్తాడు, కానీ ఇద్దరూ తమ ప్రేమను బయటపెట్టుకోరు. ఈ క్రమంలో, పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఆనంద్ (నరేంద్ర రవి) తన పెళ్లి కోసం గ్రాండ్‌గా ప్రీ వెడ్డింగ్ షూట్ తీయించడానికి రమేష్‌ను సంప్రదిస్తాడు. ఆనంద్-సౌందర్యల ప్రీ వెడ్డింగ్ షూట్‌ను రమేష్ ఎంతో రిచ్‌గా పూర్తి చేస్తాడు. అయితే, దురదృష్టవశాత్తూ, ఆ ఫుటేజ్ ఉన్న చిప్ మిస్ అవుతుంది. చిప్ పోయిన విషయం ఆనంద్‌కు తెలిస్తే ఏం జరుగుతుందోనని భయపడ్డ రమేష్, ఆ సమస్య నుంచి బయటపడేందుకు హేమతో కలిసి ఆనంద్ పెళ్లినే చెడగొట్టాలని ప్లాన్ చేస్తాడు. కానీ, అంతలోనే తన పెళ్లి ఆగిపోయిందని ఆనంద్ వచ్చి రమేష్‌కు ట్విస్ట్ ఇస్తాడు. అసలు ఆనంద్ పెళ్లి ఎందుకు ఆగిపోయింది? చిప్ ఎలా పోయింది? రమేష్-హేమల ప్రేమాయణం ఏమైంది? ఆనంద్-సౌందర్యల పెళ్లి జరిగిందా లేదా? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
#TheGreatPreWeddingShow is now streaming on @ZEE5Telugu ❤️
You showed us so much love in theatres… now it’s all yours to watch at home. 🤗
— https://t.co/Zj0ltl5MPc pic.twitter.com/I8jxFjB0XP
— Thiruveer (@iamThiruveeR) December 5, 2025