The Great Indian Suicide | కుమారి 21 ఎఫ్(Kumari 21 F) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ముంబై భామ హెబ్బా పటేల్(Hebba Patel). ఆ తరువాత వచ్చిన ఎక్కడికి పోతావు చిన్నవాడా(Ekkadiki Pothav Chinnavada), 24 కిస్సెస్, మిస్టర్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా హెబ్బా పటేల్ ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ (The Great Indian Suicide) అనే ఒక మిస్టరీ థ్రిల్లర్ మూవీలో నటిస్తుంది. విప్లవ్ కోనేటి (Viplav Koneti) దర్శకత్వంతో పాటు ఈ మూవీని సొంతంగా నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ రిలీజ్ డేట్ను ప్రకటించారు.
ఈ సినిమాను ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా (AHA) వేదికగా అక్టోబర్ 06 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు. దీనితో పాటు ఒక కొత్త పోస్టర్ను వదిలారు.
A death certificate written with faith! #TheGreatIndianSuicideOnAHA from 6th Oct. pic.twitter.com/njGOlxe9YJ
— ahavideoin (@ahavideoIN) September 30, 2023
ఈ పోస్టర్ చూస్తే.. మొదట ఈ సినిమా మదనపల్లి (Madanapalle)లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కినట్లు అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమా ఢిల్లీలో జరిగిన ఆత్మహత్యల ఆధారంగా తెరకెక్కినట్లు తెలుస్తుంది. 2018లో దేశ రాజధాని న్యూఢిల్లీలోని బురారీ ప్రాంతంలో 11 మంది ఒక ఇంట్లో చెట్టుకి ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన (Burari Deaths) ఆధారంగానే గ్రేట్ ఇండియన్ సూసైడ్ మూవీ రూపొందించారని పోస్టర్ చూస్తే అర్ధమవుతుంది. ఇక ఈ సినిమాలో హెబ్బాపటేల్తో పాటు రామ్ కార్తిక్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. నరేష్ వీకే, పవిత్రా లోకేష్ ఈ సినిమాలో భార్య భర్తలుగా కనిపించనున్నారు.