GOAT Movie Trailer Update | తమిళ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్ (Thalapathy Vijay) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (GOAT). ఈ సినిమాకు వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వం వహిస్తుండగా.. ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్, జయరాం, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 05న వరల్డ్ వైడ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. విడుదల తేదీకి ఇంకా 20 రోజులే ఉండడంతో వరుస ప్రమోషన్స్ చేస్తుంది చిత్రబృందం. ఇప్పటికే మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేసిన మేకర్స్ తాజాగా ట్రైలర్ అప్డేట్ను పంచుకున్నారు.
ఈ సినిమా ట్రైలర్‌ను ఆగష్టు 17న సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇక ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని కల్పతి ఎస్ అఘోరం నిర్మిస్తున్నాడు. మీనాక్షి చౌదరి, వైభవ్, ప్రేమి అమరెన్, యుగేంద్రన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
GET . SET . GOat 🔥
Buckle up.. #TheGoatTrailer is landing on your screens on August 17th, 5 PM 💥@actorvijay SirA @vp_offl Hero
A @thisisysr Magical #TheGreatestOfAllTime#ThalapathyIsTheGOAT#KalpathiSAghoram#KalpathiSGanesh#KalpathiSSuresh @Ags_production… pic.twitter.com/Am4OXIlBrK— venkat prabhu (@vp_offl) August 15, 2024
Also Read..