Em Jaruguthondhi | నేషనల్ బ్యూటీ రష్మిక మందన్నా, కన్నడ నటుడు దీక్షిత్‌శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’ (The Girlfriend). ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహారిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి చిత్రయూనిట్ సెకండ్ సింగిల్‌ను విడుదల చేసింది. ‘మనసా.. తెలుసా.. ఏం జరుగుతోంది..’ (Em Jaruguthondhi Song) అంటూ సాగే ఈ పాటను చిన్మయి శ్రీపాదా (Chinmayi Sripada),హేషమ్ అబ్దుల్ వాహాబ్ (Hesham Abdul Wahab) కలిసి పాడగా.. హేషమ్ సంగీతం అందించాడు. ఈ పాటకు రాకేండు మౌళి సాహిత్యం అందించాడు.