Yashna | త్రిష నటించిన సూపర్‌హిట్ వెబ్ సిరీస్ ‘బృందా’లో త్రిష చెల్లెలు ‘చుట్కీ’గా అందరి దృష్టినీ ఆకర్షించింది నటి యష్నా. నటనకు అవకాశం ఉన్న పాత్ర కావడంతో ఆడియన్స్‌కి బాగా రిజిస్టర్ అయ్యింది యష్నా. ఈ సిరీస్ కంటే ముందే నాగార్జున ‘బంగార్రాజు’లో కూడా నాగచైతన్య కాంబినేషన్లో మంచి పాత్ర పోషించింది. ఆకర్షణీయమైన రూపం, అభినయ సామర్థ్యం యష్నాకు వరాలు.
‘బృందా’ సిరీస్ తర్వాత ఈ తెలుగమ్మాయికి తెలుగుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి. కానీ తన తొలి ప్రయారిటీ తెలుగు సినిమాకే అని చెపుతున్నది యష్నా. త్వరలో మరికొన్ని సినిమాల్లో ఈ తెలుగుఅందం తళుక్కున మెరవనున్నది.