Vishwambhara | అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘విశ్వంభర’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. సోషియో-ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వశిష్ట దర్శకత్వం వహిస్తుండగా.. త్రిష కథానాయికగా నటిస్తుంది. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది చివరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ మూవీ నుంచి తాజాగా అప్డేట్ను పంచుకున్నాడు దర్శకుడు వశిష్ఠ. ఈ మూవీ చివరి షెడ్యూల్ షూటింగ్ తాజాగా స్టార్ట్ అయినట్లు మెగాస్టార్ చిరంజీవి సెట్స్‌లో జాయిన్ అయినట్లు ప్రకటించాడు. ఈ సందర్భంగా సెట్స్‌లో ఉన్న చిరు ఫొటోను పంచుకున్నాడు. అయితే లాస్ట్ షెడ్యూల్లో పాటను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తుంది.
ఈ సినిమాలో ఓ రీమిక్స్ సాంగ్ ఉండబోతోందని ప్రచారం జరుగుతోంది. చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమాలోని ఏదైన ఒక పాటను ‘విశ్వంభర’ సినిమాలో రీమిక్స్ చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చ జరుగుతోంది. బాలీవుడ్ నటి మౌని రాయ్ ఈ స్పెషల్ సాంగ్ లో చిరంజీవితో కలిసి స్టెప్పులు వేయనున్నారని కూడా సమాచారం. ‘విశ్వంభర’ సినిమాకు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
Freezing this moment to celebrate later ❤️
A Dance Storm that’ll make you BOSS-fied Shuruuuu 💥 🤙#Vishwambhara – Last Schedule begins! pic.twitter.com/rlAi8KQLfM
— Vassishta (@DirVassishta) July 25, 2025