శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘సామజవరగమన’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ పతాకాలపై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. మంగళవారం వాలెంటైన్స్ డేను పురస్కరించుకొని సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
‘ఆద్యంతం వినోదాత్మకంగా సాగే కుటుంబ కథా చిత్రమిది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ వేసవిలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని చిత్రబృందం పేర్కొంది. రెబా మోనికా జాన్, నరేష్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్, రఘుబాబు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రాంరెడ్డి, సంగీతం: గోపీసుందర్, సంభాషణలు: నందు సవిరిగాన, సమర్పణ: అనిల్ సుంకర, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామ్ అబ్బరాజు.