The Family Man S3 | మనోజ్ బాజ్‌పాయ్, జైదీప్ అహ్లావత్, ప్రియమణి వంటి అగ్ర నటీనటులు కీలక పాత్రలు పోషించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ సంచలనం సృష్టిస్తోంది. ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కు వచ్చిన ఈ సిరీస్ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ ఏడాది అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా విడుదలైన వెబ్‌సిరీస్‌లలో అత్యధికమంది వీక్షించిన సిరీస్‌గా ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ నిలిచినట్లు చిత్రబృందం ప్రకటించింది. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ నవంబరు 21న హిందీ, తెలుగుతో పాటు పలు భారతీయ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ కొత్త సీజన్ గత రెండు సీజన్ల వ్యూస్‌ను అధిగమించినట్లు చిత్రబృందం ప్రకటించింది. స్ట్రీమింగ్కు వచ్చిన తొలివారంలోనే ఈ సిరీస్ ఇండియాలోని 96 శాతం పిన్‌కోడ్స్‌కు చేరువైంది. అంతేకాకుండా, భారత్‌తో పాటు యూకే, కెనడా, ఆస్ట్రేలియా, యూఏఈ, సింగపూర్, మలేషియా వంటి 35 దేశాల్లో టాప్-5 ట్రెండింగ్‌లో నిలిచి అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరోవైపు ఈ నాలుగో సీజన్‌కి త్వరలోనే అప్డేట్ ఇవ్వబోతున్నట్లు ప్రైమ్ వీడియో ప్రకటించింది.