The Family Man S3 | ఓటీటీ ప్రియులకు పరిచయం అక్కర్లేని వెబ్ సిరీస్‌లలో ‘ది ఫ్యామిలీ మ్యాన్’ ఒకటి. మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి లీడ్ రోల్లో నటించిన ఈ సిరీస్ రెండు భాగాలుగా వచ్చి అమెజాన్ ప్రైమ్‌లో రికార్డులు నమోదు చేసింది. స్పై, థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సిరీస్‌ను దర్శకద్వయం రాజ్ & డీకే తెరకెక్కించారు. అయితే ఈ వెబ్ సిరీస్‌కి సీజన్ 3 రాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇదిలావుంటే తాజాగా ఈ సిరీస్‌కి సంబంధించి సాలిడ్ అప్డేట్ను ప్రకటించారు మేకర్స్. త్వరలోనే సీజన్ 3 రిలీజ్ అనౌన్స్మెంట్ ఉండబోతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మేకర్స్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
#TheFamilyMan S3 premieres soon on @PrimeVideoIN.@rajndk @sumank @TussharSeyth@BajpayeeManoj #Priyamani @sharibhashmi @ashleshaat @VedantSinha0218@sundeepkishan #JugalHansraj @GulPanag @shreyadhan13@DarshanKumaar #SeemaBiswas @daliptahil #VipinSharma pic.twitter.com/OPrRL9ZgaN
— CinemaRare (@CinemaRareIN) June 24, 2025
Read More