Meenakshi Chaudhary | ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న భామల్లో ఒకరు మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary). ఈ బ్యూటీ గతేడాది దళపతి విజయ్‌తో ది గోట్ సినిమాలో మెరిసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత లక్కీ భాస్కర్‌తో బ్లాక్ బస్టర్ హిట్టందుకుంది.
అయితే ది గోట్ సినిమా ఈ బ్యూటీ మాత్రం ఆశించిన స్థాయిలో బ్రేక్ ఇవ్వలేకపోయింది. త్వరలోనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా రాబోతున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకులకు హాయ్ చెప్పనుంది. ఈ సినిమా జనవరి 14న విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మీనాక్షి చౌదరి తన లైఫ్‌లో ఎదుర్కొన్న కష్టతరమైన విషయాన్ని ఒకటి షేర్ చేసుకుంది. విజయ్‌తో కలిసి నటించిన ది గోట్ సినిమా విడుదలయ్యాక నా నటనపై ఆన్లైన్లో చాలా ట్రోల్స్ వచ్చాయి. ఈ ట్రోల్స్‌తో వారంపాటు నేను డిప్రెషన్లోకి వెళ్లేలా చేశాయంటూ చెప్పుకొచ్చింది మీనాక్షి చౌదరి. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మీనాక్షి చౌదరి మరోవైపు జాతిరత్నాలు హీరో నవీన్ పొలిశెట్టితో కలిసి అనగనగా ఒక రాజు సినిమాలో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీ నుంచి విడుదల చేసిన వెడ్డింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Game Changer | గేమ్ ఛేంజర్‌లో ఈవెంట్లో విషాదం.. రూ.10 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించిన దిల్ రాజు
Nara Brahmani | మణిరత్నం సినిమాకి బాలకృష్ణ కూతురు ఎందుకు నో చెప్పిందంటే.?