Leo Movie | తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ (Thalapathy Vijay), లోకేష్ కనగరాజ్ కాంబోలో వచ్చిన చిత్రం ‘లియో’ (LEO). మాస్టర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో ఈ సినిమా రావడంతో మూవీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటించగా.. గౌతమ్ మీనన్, అర్జున్, సంజయ్ దత్, మన్సూర్ ఆలీ ఖాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
గతేడాది అక్టోబర్ 19న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.550 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్గా నిలిచింది. అయితే ఈ సినిమా వచ్చి ఏడాది అయిన సందర్భంగా మూవీ నుంచి మేకింగ్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. ది క్రానికల్స్ ఆఫ్ లియో (THE CHRONICLES OF LEO) పేరిటా ఈ వీడియో విడుదల చేయగా.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో యూట్యూబ్లో వైరల్గా మారింది.