Vishnu Vishal | బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ రెండు నెలలు మా ఇంట్లోనే ఉన్నాడని తెలిపాడు తమిళ నటుడు విష్ణు విశాల్. ఇటీవల విష్ణు విశాల్ – బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా దంపతులకు పాప జన్మించిన విషయం తెలిసిందే. ఈ పాపకు ఆమిర్ ఖాన్ మీరా అని నామకరణం చేశాడు. అయితే విష్ణు విశాల్‌కి – ఆమిర్ ఖాన్ మధ్య రిలేషన్ గురించి ఒక ఇంటర్వ్యూలో యాంకర్ అడుగగా.. విష్ణు విశాల్ ఈ విషయంపై స్పందించాడు.
గత ఏడాది ఆమిర్ ఖాన్ సర్.. తన అమ్మకి క్యాన్సర్ అని చికిత్స కోసం చెన్నై వచ్చాడు. అయితే చెన్నైలో ఎవరైన తెలిసినవారు ఉంటే బాగుంటుందని ఆమిర్ తన సన్నిహితుల ద్వారా వెతుకుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే మేము కలిశాము. అయితే ఆసుపత్రి దగ్గర్లో ఏదైన ఇల్లు రెంట్‌కి ఉంటే అందులో ఉందామని ఆమిర్ వెతుకుతుండగా.. నా ఇల్లు ఆసుపత్రి పక్కనే ఉండడంతో నా ఇంట్లో ఉండమని చెప్పాను. ఆ టైంలో ఆమిర్ సర్ ఏకంగా నాలుగు సినిమాలు చేస్తున్నాడు. దీంతో అతడికి ఆఫీస్ కూడా అవసరం అవ్వడంతో ఇంకో ఫ్లాట్ కూడా ఆఫీస్ వాడుకోవడానికి ఇచ్చాము. ఈ క్రమంలోనే చెన్నైలో వరదలు వచ్చి ఇంట్లోకి రావడంతో ఆమిర్ ఖాన్ చైన్నైలో ఉంటున్నాడని అందరికి తెలిసిపోయింది. అంటూ విష్ణు చెప్పుకోచ్చాడు.
మీరా విషయానికి వస్తే.. జ్వాలా నేను చాలా ఏండ్ల నుంచి పిల్లల కోసం ట్రై చేస్తున్నాం. తనకు ఇప్పుడు 41 అవ్వడంతో ఐవీఎఫ్ కూడా ట్రై చేశాం. ఈ విషయం ఆమిర్ ఖాన్ సర్కి చెప్పాను. దీంతో అన్ని మానేసి.. ముంబైకి రమ్మన్నాడు. అక్కడే ఒక డాక్టర్‌కి సజెస్ట్ చేశాడు. ట్రీట్మెంట్ కూడా ముంబైలోనే జరిగింది. జ్వాలా ముంబైలో ఉన్నన్ని రోజులు ఆమిర్ సర్ ఫ్యామిలీతో ఇంట్లోనే ఉంది. అంతా బాగా చూసుకున్నారు మమ్మల్ని. అందుకే మా పాప పేరును ఆమిర్ సర్ని పెట్టమన్నాం అంటూ విశాల్ చెప్పుకోచ్చాడు.
The Bond between #VishnuVishal & #AamirKhan 🫶♥️
“When #AamirKhan‘s mother got cancer, Aamir sir & team stayed at my place for 2 months. When my wife didn’t have a baby for 2 yrs, Aamir sir recommended hospital & my wife stayed at his place for 10 months” pic.twitter.com/jb7fBr6ciP
— AmuthaBharathi (@CinemaWithAB) July 8, 2025