The Bikeriders Trailer | హాలీవుడ్ స్టార్ నటులు టామ్ హార్డీ (Tom Hardy), ఆస్టిన్ బట్లర్ (Austin Butler), జోడీ కమార్ (Jodi Comer) ప్రధాన పాత్రల్లో వస్తున్న చిత్రం ది బైక్ రైడర్స్ (The Bikeriders). ప్రముఖ అమెరికన్ రచయిత డానీ లియోన్ (Dan Leon) బైక్ రైడర్స్ (1967) పుస్తకం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మడ్, లవింగ్, మిడ్నైట్ స్పెషల్ చిత్రాల దర్శకుడు జెఫ్ నికోలస్ (Jeff Nichols) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకోగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ క్రమంలో ఈ మూవీ నుంచి మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
ట్రైలర్ గమనిస్తే.. 1965లో జరిగిన స్టోరీలా ఉంది. మిడ్ వెస్ట్రన్ మోటార్ సైకిల్ క్లబ్లో ఉన్న సభ్యుల లైఫ్ స్టోరీగా ఈ సినిమా ఉండనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. ఇక వెనోమ్ (Venom) మూవీతో భారీ హిట్ అందుకున్న టామ్ హార్డీ ఈ మూవీలో బైక్ రైడర్‌గా కనిపించనుండగా.. గతేడాది ఎల్విస్ (ELVIS) మూవీతో ఆస్కార్ వరకు వెళ్లిన ఆస్టిన్ బట్లర్ ఈ మూవీతో మరోసారి అలరించనున్నాడు. హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ట్వంటీత్ సెంచరీ స్టూడియోస్ (20th Century Studios) ఈ సినిమాను నిర్మిస్తుండగా.. డిసెంబర్ 01న ఇండియాలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
20TH CENTURY STUDIOS UNVEILS TRAILER, POSTER AND IMAGES FOR “THE BIKERIDERS”!
Film Garners Outstanding Reviews at Telluride Film Festival Screening
“The Bikeriders” Arrives in Indian Theatres on December 1..
Trailer link: https://t.co/DGYyC6cmHX#TheBikeriders pic.twitter.com/Za7xPgIhbQ
— Ramesh Bala (@rameshlaus) September 7, 2023