The Bengal Files | ‘ది కశ్మీర్ ఫైల్స్’, ‘ది తాష్కెంట్ ఫైల్స్’ వంటి వివాదాస్పద చిత్రాలతో గుర్తింపు పొందిన దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వంలో వచ్చిన మరో వివాదాస్పదమైన చిత్రం ది బెంగాల్ ఫైల్స్ (The Bengal Files). ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టార్ను అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా బీజేపీ ప్రాపగండా సినిమా అంటూ ప్రేక్షకులు తిప్పికొట్టారు. అయితే థియేటర్లలో నిరాశపరిచిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో నవంబరు 21వ తేదీ నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ జీ5 పోస్టర్ను పంచుకుంది.
పల్లవి జోషి సహనిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, గోవింద్ నామ్దేవ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఇండియా – పాకిస్థాన్ విభజనకి ముందు బెంగాల్లో హిందు – ముస్లింల మధ్య జరిగిన అల్లర్ల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.
The buried voices find their fire. Bengal’s boldest chapter is here to roar.#TheBengalFiles premiering on 21st November, on #ZEE5 pic.twitter.com/PqKb7QJxk9
— ZEE5Official (@ZEE5India) November 8, 2025