The Archies Movie | షారుఖ్ ఖాన్ గారాలపట్టి సుహానా ఖాన్ (Suhana khan), శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ (Kushi kapoor), అమితాబ్ మనువడు అగస్త్య నంద (Agastya Nanda) ప్రధాన పాత్రల్లో అరంగేట్రం చేస్తున్న చిత్రం ది ఆర్చీస్ (The Archies Movie). గల్లీ బాయ్, జిందగీ నా మిలేగీ దోబారా, లస్ట్ స్టోరీస్ చిత్రాల ఫేం బాలీవుడ్ స్టార్ దర్శకురాలు జోయా అక్తర్ (Zoya Akthar) ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో నేరుగా విడుదలకానున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టీజర్, ట్రైలర్లు ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ మ్యూజికల్ అప్డేట్ ఇచ్చారు.
ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ సునోహ్ (Sunoh) అనే పాటను చిత్రబృందం విడుదల చేసింది. ఇక ఈ పాటను గాయకుడు తేజస్ పాడగా.. అంకుర్ తివారీ, ది ఐలాండర్స్ కంపోజ్ చేశారు. జావేద్ అక్తర్ లిరిక్స్ రాశారు. ఇక ఈ మూవీ డిసెంబర్ 07న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాను 1964 ఇయర్లో జరిగిన కథగా తెరకెక్కించగా.. బాల్యం, టీనేజీలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందింది.