Vishwak Sen | నా జీవితంలో అది ఊహించని సర్ప్రైజ్.. ఓరి దేవుడా హీరో విశ్వక్ సేన్ చిట్‌చాట్
అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమా ఓరి దేవుడా (OriDevuda). అక్టోబర్ 21న విడుదల సందర్భంగా విశ్వక్ సేన్ మీడియాతో చిట్ చాట్ చేశాడు. ఓరి దేవుడా సినిమా విశేషాలు విశ్వక్ సేన్ మాటల్లోనే..
టాలీవుడ్ (Tollywood) యువ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen), మిథిలా పాల్కర్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఓరి దేవుడా (OriDevuda). విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఆశాభట్ మరో కీ రోల్ చేస్తోంది. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా అక్టోబర్ 21న విడుదలవుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి స్పందన వస్తోంది. విడుదల సందర్భంగా విశ్వక్ సేన్ మీడియాతో చిట్ చాట్ చేశాడు. ఓరి దేవుడా సినిమా విశేషాలు విశ్వక్ సేన్ మాటల్లోనే..
ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలైంది..?
2020లో ఓరి దేవుడా మొదలైంది.. అయితే కోవిడ్ లాక్ డౌన్ కారణంగా సినిమా ఆలస్యమైంది. 2021లోనే ఈ సినిమా విడుదల కావాల్సింది. వాస్తవానికి నేను అశోకవనంలో అర్జుణ కల్యాణం సినిమా కంటే ముందే ఓరి దేవుడా సినిమా చేయాలని ఫిక్స్ అయ్యా. ఏవీఏకేలో కొంత పెద్ద వయస్కుడిగా కనిపిస్తే.. ఓరి దేవుడా చిత్రంలో యువకుడి పాత్రలో కనిపిస్తా.
వెంకటేశ్‌తో కలిసి పనిచేయడంపై మీ ఫీలింగ్..?
వెంకటేశ్ గారితో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. నాగార్జున, వెంకటేశ్ సార్‌తో సినిమాలు చేయాలని ఎప్పుడూ అనుకుంటుంటా. ఈ సినిమా నా జీవితంలో ఊహించని సర్ప్రైజ్. సెట్స్‌లో వెంకీ సార్‌తో షూటింగ్‌ను చాలా ఎంజాయ్ చేశా. ఆయన సన్నివేశాలను ప్రేక్షకులు ఫుల్ ఎంజాయ్ చేస్తారు.
రేపు వేరే సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి కదా..ఎలా అనిపిస్తుంది..?
నా సినిమా పట్ల చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నా. అన్ని సినిమాలు కూడా బాగా ఆడుతాయని ఆశిస్తున్నా. మన ఇండస్ట్రీ ఒకదానివెనుక ఒకటి వరుసగా మూడు బ్లాక్ బస్టర్స్‌ను అందుకోబోతుందని నిర్మాత సురేశ్ బాబుగారన్నారు. సీతారామం, బింబిసార సినిమాలు ఒకే రోజు విడుదలయ్యాయి. ఒకవేళ సినిమాలు బాగుంటే ఈ దీపావళికి అన్ని సినిమాలను ప్రేక్షకులు థియేటర్లలో ఎంజాయ్ చేస్తారు.
మీ కొత్త సినిమాల గురించి..?
ఫలక్ నుమా దాస్-2 పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించబోతున్నాం. వచ్చే ఏడాది చివరలో సెట్స్‌పైకి తీసుకెళ్తాం. అర్జున్ సార్‌తో చేస్తున్న సినిమా షూటింగ్ నవంబర్ ౩న మొదలు కానుంది. దీంతోపాటు నేను నటిస్తున్న ధమ్కీ, గామి, రామ్ తల్లూరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూడా మొదలుపెడతాం. గామి సినిమా వీఎఫ్ఎక్స్ పనుల కారణంగా ఆలస్యమైంది.
Read also :Michael Teaser | స్టన్నింగ్‌గా సందీప్ కిషన్-విజయ్ సేతుపతి మైఖేల్ టీజర్
Read also : Saikumar | డైలాగ్ కింగ్ సాయికుమార్ 50 ఏండ్ల నట ప్రస్థానం.. ట్రెండింగ్‌లో స్టిల్
Read also : Venkat Prabhu | డైరెక్టర్ వెంకట్ ప్రభు-శివకార్తీకేయన్ కొత్త సినిమా అప్డేట్.. వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

