పాన్ ఇండియా స్టోరీ నేపథ్యంలో సందీప్ కిషన్ (Sundeep Kishan)-విజయ్ సేతుపతి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం మైఖేల్. స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. స్టన్నింగ్ విజువల్స్‌తో రూపొందించిన మైఖేల్ టీజర్‌ను మేకర్స్ లాంఛ్ చేశారు. శ్యామ్ సీఎస్ కంపోజ్ చేసిన బీజీఎం సినిమాపై క్యూరియాసిటీ రేకెత్తిస్తోంది.
దివ్యాంక కౌశిక్, అనసూయ గ్లామరస్ రోల్స్‌లో కనిపిస్తుండగా..గౌతమ్ మీనన్, వరుణ్ సందేశ్, విజయ్ సేతుపతి స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టబోతున్నట్టు టీజర్‌తో తెలిసిపోతుంది. రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్న మైఖేల్ చిత్రం గ్యాంగ్ స్టర్ డ్రామాగా వస్తోంది. సందీప్ కిషన్ ఇదివరకెన్నడూ కనిపించని లుక్‌తో కనిపిస్తూ..ఈ సారి సూపర్ హిట్ట కొట్టడం పక్కా అని టీజర్‌తోనే చెప్పేస్తున్నాడు.
ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, కరణ్ సి ప్రొడక్షన్స్ బ్యానర్లపై పీ రామ్మోహన్ రావు, భరత్ చౌదరీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కోలీవుడ్ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
Read also : Saikumar | డైలాగ్ కింగ్ సాయికుమార్ 50 ఏండ్ల నట ప్రస్థానం.. ట్రెండింగ్‌లో స్టిల్
Read also : Venkat Prabhu | డైరెక్టర్ వెంకట్ ప్రభు-శివకార్తీకేయన్ కొత్త సినిమా అప్డేట్.. వీడియో